నిజామాబాదు కమీషనరేట్
*బాధితుడు*: నిజామాబాదు పట్టణ వాసి, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు *నిందితుడు*: కొండూరి ఏకవీర s /o శంకర్ , వయసు: 24 yrs, ప్రైవేట్ జాబ్, r/o హన్మకొండ, , వరంగల్ *నేరము జరిగిన విధానం* : ఒక మగ వ్యక్తి, తన గొంతుని ఒక స్త్రీ గొంతుగా మర్చి బాధితుడితో మాట్లాడుతూ, బాధితున్నీ హనీ ట్రాప్ చేసి, అతన్ని భయబ్రాంతులకు గురిచేసినారు, అలాగే అతనికి మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు కాజేసినారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఈరోజు హనీ ట్రాప్ కి సంబందించిన నేరములో , నిందితున్నీ పట్టుకొని, డిస్ట్రిక్ట్ కోర్ట్ నందు హాజరు పరిచి అక్కడినుండి డిస్ట్రిక్ట్ జైలు కి పంపటం జరిగింది.
*నేరస్తున్ని పట్టుకోవటంలో, చాకచక్యంగా పనిచేసిన, SI పూర్ణశ్వర్, కానిస్టేబుల్ రాఘవేంద్ర, శ్రీరామ్, సురేష్ లను dsp గారు అభినందించినరు.*
నిజామాబాదు ప్రజలకు సూచన :1)ఏదేని సైబర్ నేరము జరిగిన వెంటనే *1930* కి కాల్ చేసి మీ వివరాలు తెలిపి, పిటిషన్ రిజిస్టర్ చేసుకోగలరు, 2) ఒకవేళ, 1930 నెంబర్ కి వెయిటింగ్ వచ్చిన యెడల *www.cybercrime.gov.in* లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు తెలుపగలరు.ఇట్లు,Y.Venkateshwar Rao. DSPCyber Crime Police stationNizamabad.