భర్త వేధింపులు తాళలేక గుండెపోటు తో వివాహిత మృతి చెందిన ఘటన గురువారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం…
ఆర్మూర్ కు చెందిన ఆశ్ర(28).నిజామాబాద్, అర్శపల్లీ కి చెందిన సులేమాన్ అలీఖాన్ తో వివాహమైంది. ఇటీవలే ఆశ్ర నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువు కు జన్మనిచ్చింది.
ఆడ శిశువు కు జన్మించినందుకు ఈ మేరకు భర్త సులేమాన్ అలీఖాన్ ఆసుపత్రికి వచ్చి ఆశ్ర కు వెందించినట్లు తెలిపారు. ఆశ్ర అమ్మవాళ్ళు సులేమాన్ అలీఖాన్ కు అందుకు గానూ కొంత మొత్తం నగదు,బంగారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
అయినా భర్త వేధింపులు తాళలేక మానసికంగా కుంగిపోయి గుండెపోటు గురువారం మృతి చెందినట్లు తెలిపారు.ఆశ్ర తల్లి దండ్రులు మృత దేహాన్ని అర్సపల్లి లోని భర్త ఇంటికి తీసుకెళ్లారు.
సులేమాన్ అలీఖాన్ అక్కడ నుంచి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అందుకు తల్లి దండ్రులు మృత దేహాన్ని ఆర్మూర్ లోనీ వారి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు.