అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయాల్సిన ఇంచార్జి మంత్రి అడ్రస్ లేకుండా పోయారు.
ఆయన హైదారాబాద్ కే పరిమితం కావడంతో జిల్లాకు చెందిన నేతలు ఆయన వద్దకు వెళ్లి కలిసి అభివృద్ధి పనులను ప్రస్తావించి వస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు ఇద్దరే ఉన్న నేపథ్యంలో ఆయన ఏంతో క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది.
కానీ జిల్లా వైపే కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలే నొచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఇంచార్జ్ మంత్రులను తెరమీదికి తెచ్చింది.
గతంలో డీడీఆర్సీకి డిఆర్సీ లుండేవి కానీ బిఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు వీటిని తెరమరుగు చేసింది. జిల్లాకు ఇంచార్జి మంత్రి వ్యవస్థే లేకుండా పోయింది.
కానీ కొత్తగా అధునాత సాంకేతిక వ్యవస్థలతో శువిశాలమైన భవనాలతో కొత్త కలెక్టరేట్ భవనాలను అందుబాటులో కి తెచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే వుండేలాఈ భవనాలు నిర్మించారు. అయితే ఇందులో మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్ ను సైతం అందుబాటులో తెచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాత వ్యవస్థ ను తెరమీదకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగానియామకం అయ్యారు. మొదట్లో ఆయన రెండు జిల్లాలోనూ ఆయా కలెక్టరేట్ లలో అధికారులతో సమావేశం అయ్యారు.
అభివృద్ధి పనులను రివ్యూ చేసి అధికారులకు కీలక సూచనలే చేశారు. ఆయన ఇంచార్జి మంత్రిగా నియామకం అయి దాదాపు ఏడు నెలలు పూర్తీ అయింది. కానీ కేవలం ఒక్కసారే అధికారులతో అభివృద్ధి పనులను సమీక్షించారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ లుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు నలుగురే ఉన్నారు. అందులో ముగ్గురు మొదటి ఎమ్మెల్యే లుగా గెల్చిన వారే దీనితో జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
అధికార యంత్రాంగం మునుపటి నత్తనడక ధోరణి వీడడం లేదు. ఇంకా కీలక స్థానాల్లో బిఆర్ యస్ ముద్ర ఉన్న అధికారులే ఉన్నారు. అందుకే ఆయా సెగ్మెంట్ లలో అధికార పార్టీ నేతల ఉనికే లేకుండా పోయింది. అందుకే నేతలు వసూళ్ల దందాలకే పరిమితం అవుతున్నారు.
ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన షబ్బీర్ అలీ సైతం ఆయా సంక్షేమ శాఖల ను రివ్యూ చేస్తారని భావించారు కానీ ఆయన కూడా హైదారాబాద్ కె పరిమితం అయ్యారు.
మంత్రి ఛాన్స్ మిస్ అయిన సుదర్శన్ రెడ్డి కూడా పాలనా వ్యవహారాల్లో తన అవసరాల మేరకే జోక్యం చేసుకుంటున్నారు. అందుకే జిల్లా అధికారులది ఆడిందే అట పాడిందే పాట అన్నట్లుగా సాగుతుంది.