డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి.. సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్. డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంచాలని సిపిఎం డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ… జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పేదలు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందనీ విమర్శించాడు.
అదేవిధంగా నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించటం వలన ఆ ఇండ్లు పూర్తయి సంవత్సరాలు గడిచినప్పటికీ వాటిని పేదలకు ఇవ్వకపోవడంతో వాటి తలుపులు కిటికీలు దొంగలించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మరి ఆ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేకుండా ఉందని వారు అన్నారు. అదేవిధంగా జిల్లాలో అసంపూర్తిగా వందలాది డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాన్ని ఆపేయడం జరిగిందని తెలిపారు.
కొద్దిపాటి నిధులను విడుదల చేస్తే అవి కూడా పూర్తయి పేదలకు పంపిణీ చేయడం సులభం అవుతుందని అందువల్ల వెంటనే అర్ధాంతరంగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో వేలాదిమంది నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని వాటిని గత ప్రభుత్వం 58 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ కోసం అనుమతించి దరఖాస్తు పెట్టుకున్న వారికి పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వలేదని ధనవంతులకు 59 జీవో కింద అనుమతించారని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ పట్టాలను ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలను కొంతమంది అధికార పార్టీ దళారులు పేదలను అక్కడి నుంచి తొలగించి వాటిల్లో అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారని వారి పైన చర్యలు తీసుకొని కోరారు.
భూములు పేదలకు దక్కేటట్టు చూడాలని వారు డిమాండ్ చేశారు. తప్పకుండా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేటట్టు కృషి చేస్తానని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కటారి రాములు, నాయక్ వాడి శ్రీనివాస్, పద్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.