దాదాపు యేడాది కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ భారీ కార్యవర్గం ను ఖరారు చేసారు. సామజిక సమీకరణాల తో ఎడతెగని కసరత్తులు చేసి కొలిక్కి తెచ్చారు. కొత్త పీసీసీ కార్యవర్గంలో జిల్లాకు నామాత్రం ప్రాధాన్యత దక్కింది. దిగ్గజ నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు.
దాదాపు అరడజన్ మంది పీసీసీ లో పదవుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండే. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా కావడంతో కార్యవర్గం లో ఎక్కువగా మందికి సర్దుబాటు చేసే అవకాశం లేకుండా పోయింది.
నాలుగు దశాబ్దాలుగా తన వెంటే నడుస్తున్న వీర విధేయులవైపు మొగ్గు చూపారు. ప్రతికూల పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన నేతలకు ఏదో రకంగా అందలం ఎక్కించే యోచనలో ఉన్నారు.
పార్టీలో దిగ్గజ నేతగా ఉన్నాసరే ప్రభుత్వ పదవుల పందేరం మహేష్ మాట చెల్లుబాటు కాలేదు. గతంలో పార్టీ పదవుల్లోనూ మహేష్ వర్గీయులకు పదవులేవి దక్కలేదు. ఇప్పడు పీసీసీ చీఫ్ హోదా లో మహేష్ తన విధేయులకు పదవులు కట్టబెడుతున్నారు.
ఎలాగో సినియర్ లకే పదవులు ఇవ్వాలని అధిష్ఠానము నిర్దేశించింది. అందుకే దశాబ్దాల కాలంగా పార్టీ లో కొసాగుతున్న వారికే మహేష్ ఈసారి పదవుల వచ్చేలా చక్రం తిప్పారు. గతంలో పీసీసీ కార్యవర్గంలో కనీసం నలుగురయిదు గురు వుండేది.
సుదర్శన్ రెడ్డి కోశాధికారి గా తాహేర్ పీసీసీ ఉపాధ్యక్షుడిగా నగేష్ రెడ్డి గడుగు గంగాధర్ లు ప్రధాన కార్యదర్శులుగా రామకృష్ణ మజీద్ రాం భూపాల్ కార్యదర్శులుగా పనిచేసారు.
జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన నేపథ్యంలో ఈసారి పీసీసీ లో జిల్లా నుంచి ఎవరెవరికి పదవులు దక్కుతాయననేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా ఉండే. అసెంబ్లీ ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించలేక పోయింది.
అయినప్పటికి ఏకంగా అయిదు కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు దక్కాయి. కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కి సానుకూల పలితాలు వస్తాయా లేదా అనేది పక్కాగా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
అందుకే ఎమ్మెల్యే లులేని నియోజకవర్గాల నుంచి బలమైన నేతలకు పీసీసీ లో చోటు కల్పించాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో ఉండే. ముఖ్యంగా ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్,సెగ్మెంట్ ల నుంచి పీసీసీ లో ప్రాతినిధ్యం ఉండాలని కొందరు సీనియర్లు మహేష్ కు సూచించారు.
జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం ఇచ్చారు.పీసీసీ కార్యదర్శిగా ఉన్న రాం భూపాల్ కు ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఆయన మొదటి నుంచి మహేష్ కు అత్యంత విధేయుడిగా ఉన్నారు.
తన వెంటే ఉండే జివి రామకృష్ణ , మజీద్ లకు సైతం ఆయా కీలక కమిటీ ల్లో సభ్యులుగా నియామకం అయ్యారు. రాబోయే రోజుల్లో మరో ఇద్దరికి పార్టీ లో కీలక పదవులు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. తన సొంత జిల్లా కావడంతో అధిష్టానం సైతం పెద్దగా అడ్డుచెప్పక పోవచ్చు.!
