60 గ్రాముల బంగారం స్వాధీనం జిల్లాలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మిట్టపల్లి లక్ష్మణ్‌ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.
నిందితుడి నుంచి సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టపల్లి లక్ష్మణ్ గత కొన్ని నెలలుగా నిజామాబాద్ రూరల్, నవీపేట్, నందిపేట్ మరియు కామారెడ్డి జిల్లాల్లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఆదివారం నాడు నిందితుడు కాంటేశ్వర్ ప్రాంతంలో ఉన్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నట్లూ తెలిపారు. నిందితుడు లక్ష్మణ్‌పై గతంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనేక కేసులు నమోదయ్యాయనీ అన్నారు.
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇతను పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందనీ పేర్కొన్నారు.నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
