నిజామాబాద్ నగరంలో ని సుభాష్ నగర్ లో సోమవారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఎస్బిఐ బ్యాంకు వెనుక భాగం లో ఇంటి బయట చెట్ల కు పూలు తెంపుతున్న బాగిర్తి అనే మహిళా మెడలో నుంచి గుర్తు తెలియని ఆగంతకుడు గొలుసు తెంపుకొని వెళ్ళాడు.
ఇద్దరు యువకులు బైకు మీద వచ్చినప్పటికి ఒక్కడు బైకుఆన్ పెట్టుకొని వుండగా మరో యువకుడు మహిళా మెడలో గొలుసు తెంపి మెరుపు వేగంగా తో పారి పోయారు.
బాధిత మహిళా కేకలు వేసిన ఫలితం లేకుండా పోయింది.పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాయి దుండగులు ఎత్తుకెళ్లిన చైన్ రెండు తులాల వుంటుందని బాధిత మహిళా పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొంది
