తాజాగా 10వ డివిజన్‌కు చెందిన సీనియర్ బిఆర్ఎస్ (టిఆర్ఎస్) నాయకుడు మహమ్మద్ ఖదీర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఖదీర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.
ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, మోయిన్ యూనివర్స్ మరియు 10వ డివిజన్ ఇంచార్జ్ షాదాబ్ ఖాన్ ల సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఖదీర్‌కు పార్టీ కండువా కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఖదీర్ వెల్లడించారు.
ఈ చేరికతో 10వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేశారు. వంద మందికి పైగా కార్యకర్తలు ఒకేసారి పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
