HomeTelanganaHyderabadఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మోత రోహిత్ ప్రమాణ స్వీకారం..

ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మోత రోహిత్ ప్రమాణ స్వీకారం..

ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడిగా మోత రోహిత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన మోత రోహిత్‌ను నవీన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబద్ధత గల యువ నాయకుడు మోత రోహిత్ నాయకత్వంలో ఖైరతాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments