బీమ్ గల్ లో దొంగల అలజడి 3తులాల బంగారు,45 తులాల వెండి చోరీ…మంగళవారం రాత్రి భీమ్‌గల్ పట్టణంలో దొంగలు అలజడి సృష్టించారు .
తాళం వేసిన ఇంట్లో దోంగలు చొరబడి బంగారం,వెండి ఎత్తుకు పోయారు.
భీమ్‌గల్ పట్టణంలోని బోయగల్లి కాలనీ చెందిన కొత్తవల శ్రీనివాస్ కుటుంబీకులంతా ఓ గదిలో నిద్రిస్తుండగా ఆ గదికి గడియ పెట్టి మరో గదిలోకి చొరబడ్డ దుండగులు 3తులాల బంగారు,45 తులాల వెండి ఆభరణాలను దొంగిలించారు.
ఈ విషయంపై బాధితుడు కొత్తవల శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా క్లూ టీంతో నమూనాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
