Saturday, May 2, 2026
HomeCRIMEచేపల వేటకు వెళ్లి యువకుడు మృతి...

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి…

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని శాస్ర్తీ నగర్ కు చెందిన సంపంగి వెంకటి(19).

అతని స్నేహితుడు ఇద్దరు కలిసి శుక్రవారం సాయంత్రం శాస్ర్తీ నగర్ లోని నీటి కుంటల లో చేపల వేటకు వెళ్లినట్లు తెలిపారు. ఆలస్యం అవుతుందని అతని స్నేహితుడు ఇంటికి వెళ్దాం అని చెప్పడంతో నువ్వు వెళ్ళు నేను కాసేపయాక వస్తానని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు.

ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు,స్నేహితుడికి అడగగా చేపలకు వెళ్లినట్లు సమాచారం చెప్పడంతో శనివారం ఉదయం వెళ్లి నీటి కుంటలో గాలించగా మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్రావు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!