వెన్ను నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్న ఘటన మోపాల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన పల్లే నవీన్(37). భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.గత కొంత కాలంగా వెన్ను నొప్పి తో తీవ్ర మనస్థాపానికి చెంది శుక్రవారం ఇంటినుంచి బయటకు వెళ్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
