జీవితంపై విరక్తితో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్ఐ సుదీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం. మాక్లూర్ మండలంలోని మాణిక్ భండార్ తండాకు చెందిన బానావత్ దివ్య (20).
చిన్న నాటి నుంచి కళ్ళు సరిగ్గా కనిపించవని కుటుంబ సభ్యులు తెలిపారు.అలాగే మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కిటికీ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తండ్రి బానావత్ అమర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ రావు పేర్కొన్నారు.