ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన 5వ టౌన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని ఆటో నగర్ కు చెందిన అక్బర్(25). తన స్నేహితులతో కలిసి నగర శివారులోని నాగారం లోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళారు.
ఈ క్రమంలో అక్బర్ మద్యం సేవించి ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. చాపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో మునిగినట్లు తెలిపారు. సదరు యువకుడు నీ ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.