రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీవో గా పనిచేసిన వంశీమోహన్, తన అధికాారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఆయన తన సమీప బంధువుల పేరుతొ భారీగా భూము లు కూడబెట్టారని ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది
