మంగళవారం సరిహద్దుల్లో రవాణాశాఖ చెక్ పోస్టుల మీద అవినీతి నిరోధక శాఖ ఏక కాలం లో మెరుపు దాడులు చేసింది.
ఇందులో భాగంగా డిఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా చెక్ పోస్టుల్లో సోదాలు చేసారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ లోని సలాబత్ పూర్ తో బిక్కనూర్ మండలం లోనూ చెక్ పోస్టుల్లో సోదాలు చేసి రికార్డ్ లు తనిఖీ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర చెక్ పోస్టులో సోదాలు చేసి లెక్కకు లేని 13500 రూపాయలను నగదు ను స్వాధీనం చేసుకున్నారు.
బాద్యులైన అధికారుల మీద తదుపరి చర్యలకోసం ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు