నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు దారుణంగా హత్య కు గురయ్యాడు . ఈ ఘటన మంగళవారం 3వ టౌన్ పరిధి లో చోటు చేసుకుంది..
ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అలీ హుస్సేన్ (38), భార్య చంద్రి నిర్మల ను 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.అనంతర అలీ హుస్సేన్ మద్యానికి బానిసై రోజూ తాగి వచ్చి భార్యను కొట్టేవాడు .
ఈ క్రమంలో భార్య అయినా చంద్రీ నిర్మల అతన్ని వదిలేసి వాళ్ళ తల్లీ గారి ఇంటికి వెళ్ళిపోయింది.5సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది.
ఈ క్రమంలో అలీ హుస్సేన్ నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ తో సహా జీవనం కొనసాగిస్తున్నడు ఆదివారం అలీ హుస్సేన్ ఓ మహిళతో గొడవకు దిగాడు సదరు మహిళ, ఆమె భర్త మరియు బందువులు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు దీనితో తీవ్రగాయాలైన అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.