లోకసభ ఎన్నికల ఫలితాలు రాకముందే మంత్రి వర్గ విస్తరణ అంశం తెరమీదకి వచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సైతం ఇదే కసరత్తుల్లో ఉన్నారనే ప్రచారం అధికార పార్టీలో విసృతంగా సాగుతుంది. క్యాబినెట్ లో ఖాళీ గా ఆరు స్థానాలను భర్తీ కి ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వచ్చే చివరి వారంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం వుందని ఓ సీనియర్ నేత చెప్తున్నారు.
కనీసం ఈసారి విస్తరణలో నైన జిల్లాకు మంత్రి పదవీ దక్కుతుందా లేదా అనేది ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది.జిల్లాకు మంత్రి లేక పోవడంతో పార్టీ అధికారంలోకి వచ్చినా క్యాడర్ లో ఇంకా ఆ జోష్ రావడం లేదు. పాలన వ్యవహారాల్లో ఇంకా బిఆర్ యస్ నేతల హావా నే సాగుతుంది. డిసెంబర్ లో కొలువు దీరిన రేవంత్ క్యాబినెట్ లో జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు ఖచ్చితంగా రెండేసి మంత్రి పదవులు దక్కేవి. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలో సానుకూల ఫలితాలు సాధించలేక పోయింది. దీనితో అధిష్టానం సైతం మంత్రి గా ఎవరికి అవకాశం ఇవ్వాలో తేల్చుకోలేక పోతుంది. నిజామాబాద్ నుంచి ఇద్దరూ కామారెడ్డి నుంచి ఇద్దరే ఎమ్మెల్యే లుగా గెలిచారు.
ఇందులో సుదర్శన్ రెడ్డి మినహా మిగితా ముగ్గురు మొదటి సారి ఎమ్మెల్యే లుగా గెల్చిన వారే .. మరో దిగ్గజ నేత మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ గా నియామకం అయ్యారు. దీనితో బిసి కోట మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ మహేష్ పీసీసీ చీఫ్ పదవీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనితో సుదర్శన్ రెడ్డి కే మంత్రి పదవీ ఇవ్వడం అనివార్యంగా భావిస్తున్నారు.
ఆయన సీనియార్టీ ని పరిగణలోకి తీసుకోని స్పీకర్ పదవీ ఇచ్చారు. కానీ మొదటి నుంచి మంత్రి పదవీ మీద ఆశలు పెట్టుకున్న ఆయన స్పీకర్ బాధ్యతలు తీసుకువడానికి ససేమిరా అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తో సాన్నిహిత్యం బంధుత్వం ఉన్న నేపథ్యంలో మొదటి దఫాలో మంత్రి పదవీ వస్తుందని సుదర్శన్ రెడ్డి ధీమాతో ఉండే.
కానీ అధిష్టానం ఆయనకు మంత్రి ఇవ్వడానికి సానుకూలత చూపలేదు.దీనితో సుదర్శన్ రెడ్డి తీవ్ర నిరాశ చెందారు. లోకసభ ఎన్నికల ల్లో నూ ఆయనకు నియోజకవర్గ ఇంచార్జి నియమించినా బోధన్ సెగ్మెంట్ కే పరిమితం అయి పనిచేసారు. కానీ గతంలో మంత్రి గా పనిచేసిన ఆయన కు మంత్రి పదవీ ఇస్తేనే జిల్లాలో పాలనా వ్యవస్థ గాడిలో పడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు .
నిజానికి పార్టీ కష్ట కాలం లో ఆయన జిల్లాలో గట్టిగా నిలబడ్డారు.కానీ ఈసారి విస్తరణలో మంత్రి పదవీ ఫై సుదర్శన్ రెడ్డి కూడా ఆశాభావం తో ఉన్నారు. కానీ లోకసభ ఎన్నికల్లో పలితాలు తేడా వస్తే మంత్రి పదవీ అవకాశాలు ఎలా ఉంటాయనేది ఆయన సన్నిహితుల్లో చర్చనీయాంశంగా మారాయి