ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…
డిచ్ పల్లి మండలం, గ్రామానికి మహమ్మద్ అతరుల్ల(38) మెడికల్ ఫార్మశిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య జువేరియా ఉస్మా డెలివరీ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు.
డెలివరీ తర్వాత ఆసుపత్రిలో ఉన్న మహమ్మద్ అతరుల్ల గురువారం తెల్లారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం కి వెళ్ళారు. ప్రమాదవశాత్తు కాలు జారీ బొక్క బోర్లా పడి ఉన్నటు తెలిపారు.
హుటాహుటిన డాక్టర్ ను సంప్రదించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు