ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్ణపల్లి – ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ ల కథనం ప్రకారం.
సుమారు 40-45 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని కదులుతున్న రైలులో నుండి ప్రమాదవశాత్తు జారీ క్రింద పడగా తీవ్ర రక్త గాయాలు అయి అక్కడిక్కడే చనిపోయినాడు.
మృతుడు తెలుపు రంగు T-shirt, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
మృతినీ పూర్తీ వివరాలు తెలియాల్సి వుంది. వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.