Friday, April 24, 2026
HomeTelanganaNizamabadఆసక్తిగా మారిన పీసీసీ రేసు .....రేసులో మధుగౌడ్ మహేష్ లు ..... పదోన్నతి ఫై మహేష్...

ఆసక్తిగా మారిన పీసీసీ రేసు …..రేసులో మధుగౌడ్ మహేష్ లు ….. పదోన్నతి ఫై మహేష్ ఆశలు …..అడ్డుపడుతున్న మాజీ మంత్రులు ……ఢిల్లీ లో పావులు కదుపుతున్న వైనం …..బీసీ నేత వైపే అధిష్టానం మొగ్గు …వచ్చే నెలలో కొత్త పీసీసీ ?

రేవంత్ సీఎం బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కాంగ్రెస్ ఆసక్తిగా మారింది. జిల్లాకుచెందిన ఇద్దరు దిగ్గజ నేతలే పీసీసీ రేసులో ముందున్నారు.

వచ్చే నెలలలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశం ఉండడంతో సీనియర్ నేతలు ఢిల్లీ స్థాయిలో పదవీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈసారి పీసీసీ బాధ్యతలు బీసీ సామాజికవర్గం కు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది.

రేవంత్ బట్టి లకు తోడుగా ఓ బలమైన బీసీ నేత ను రంగంలోకి దించే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. అందుకే మహేష్ మధుయాష్కీ అంజనీ కుమార్ యాదవ్ లు సీరియస్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

వీరిలో ఇద్దరు నేతలు అసెంబ్లీ లోకసభ ఎన్నికలో ఓడిన వారు కాగ మహేష్ ఒక్కరే పోటీ చేసే అవకాశం వచ్చినా టికెట్ త్యాగం చేసారు. అందుకు ప్రతిగా ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టారు. అలాగే పార్టీలో మరింత ఎదిగేలా చేస్తామని భరోసా కూడా ఇచ్చారు. అందుకే ఆయన పీసీసీ బాధ్యతలమీద ధీమాతో ఉన్నారు.

కానీ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులే మహేష్ గౌడ్ పీసీసీ ఇవ్వడం ఫై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. అదే మహేష్ కు మింగుడుపడడం లేదు. దీనితో ఢిల్లీ స్థాయిలో పావులు కదులుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మహేష్ మొదటి నుంచి ఢిల్లీ పెద్దల వద్ద మంచి పలుకుబడి సంపాదించారు.

సంస్థాగత వ్యవహారాలఇంచార్జ్ గా అసెంబ్లీ లోకసభ ఎన్నికల కతృవు సమర్థవంతంగా పూర్తీ చేసిన నేపథ్యంలో . తనకు పార్టీలో పదోన్నతి కావాలని ఢిల్లీ పెద్దల వద్ద పట్టుబడుతున్నారు.సీఎం రేవంత్ సైతం సానుకూలతగా ఉన్నప్పటికి జిల్లాకు చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు మాత్రం తెరవెనుక మహేష్ కు వ్యతిరేకంగా పావులు కదులుతున్నారు.

వారుకూడా ఢిల్లీ స్థాయిలోనే పార్టీ పెద్దల మీద ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.మహేష్ కు సొంత జిల్లాలో నే కీలక నేతలతో దశాబ్దకాలంగా పొసగడం లేదు. ఇప్పుడు ఆ నేతలే పీసీసీ విషయంలో ప్రతిబంధకంగా మారారు. నిజానికి పార్టీలో అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాజకీయ ప్రస్థానం సాగిస్తూ వస్తున్నారు.

కానీ పీసీసీ పదవీ విషయంలోనూ అలాంటి పరిస్థితులే ఎదురు అవుతున్నాయి.కొత్త పీసీసీ నేత విషయంలో అధిష్టానం ఈపాటికే కసరత్తులు మొదలు పెట్టింది. బిసి సామజిక వర్గం నేత వైపే మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది.

దీనితో మహేష్ కు తో పాటు మధుయాష్కి అంజనీ కుమార్ ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి. ఇందులో మధు యాష్కీ ఏఐసీసీ కార్యదర్శిగాను పనిచేసారు.

రాహుల్ బృందంలో ఒకరుగా ఉన్నారు.అదీగాక సీఎం రేవంత్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవీ మరోసారి జిల్లాకు వస్తే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యే అవకాశం వుందనే ఆశాబావంతో నేతలున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!