కేంద్ర మంత్రి మంత్రి మండలి లో ఈసారి కూడా జిల్లాకు ప్రాతినిధ్యం దక్కలేదు. రెండు సారి ఎంపీ గా గెలిచిన అర్వింద్ మంత్రి పదవీ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ బండి సంజయ్ రూపంలో ఆయన అవకాశాలకు గండి పడ్డాయి.
తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీ లకు మంత్రి పదవులు ఇవ్వాలని భావించిన బీజేపీ పెద్దలు సీనియర్ నేత కిషన్ రెడ్డి యధావిధిగా కొనసాగించారు. ఆయన అధ్యక్షత నే ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏకంగా ఎనిమిది ఎంపీ లను గెలిచింది. అందుకే అయన కొనసాగించక తప్పలేదు.
బిసి కోట లో ఈటెల అర్వింద్ సంజయ్ ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అర్వింద్ సంజయ్ ఇద్దరూ మున్నారు కాపు సామజిక వర్గం కు చెందినవారే. అందులో సంజయ్ పార్టీ లో సీనియర్ కావడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది.
ఈటెల ఎంపీ గా భారీమెజార్టి తో గెలిచినప్పటికి ఆయన కొత్తగా వచ్చారనే కారణంతోనే మంత్రి అవకాశం ఇవ్వలేదు. కానీ ఆయన కు పార్టీ బాధ్యతల్లో ఇస్తారని భావిస్తున్నారు. కానీ అర్వింద్ రెండో సారి ఎంపీ గా గెలిచిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు మాత్రమే కేంద్ర క్యాబినెట్ లో ఇప్పటిదాకా బెర్త్ దొరకలేదు.
కానీ తెలంగాణ లో సానుకూల ఫలితాల తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ఈసారి మోడీ క్యాబినెట్ లో కనీసం ముగ్గురికి స్థానం ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. గెలిచినా ఎనిమిది మంది లో ముగ్గురు బిసి ల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని భావించారు.
ఇందులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్లు ఫలితాలకు ముందే తెరమీదికి వచ్చాయి. కానీ బీజేపీ మెజార్టీ సీట్లు సాధించలేక మిత్ర పక్షాల మద్దతూ అనివార్యం అయింది.
అందుకే తెలంగాణ కు ఇదివరకు అంచనాల మేరకు మంత్రి పదవుల్లో గండి పడింది . తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం వచ్చిన నేపథ్యంలో కనీసం రెండు మంత్రి పదవులుకేటాయించారు .
రెండు మంత్రి పదవులు కేటాయిస్తేనే అర్వింద్ కు ఖచ్చితంగా అవకాశాలుంటాయని అర్వింద్ వర్గీయులు ఆశలు పెట్టుకొని ఉండే .అందులోనూ నిజామాబాద్ జిల్లాకు ఇప్పటిదాకా కేంద్ర మంత్రి మండలి లో ప్రాతినిధ్యమే దక్కలేదు.
ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు మాత్రమే ఇప్పటిదాకా మంత్రి పదవీ దక్కలేదు. అందుకే ఈసారి ఎంపీ ఎన్నికలో విజేతలెవ్వరైనా సరే మంత్రి అవ్వడం ఖాయమనే చర్చ ప్రధాన పార్టీల్లో జోరుగా సాగింది.
ఈసారి అయినా కేంద్ర క్యాబినెట్ లో జిల్లాకు బెర్త్ దక్కాలనే డిమాండ్ మొదలయ్యింది. లోకసభ ఎన్నికల పక్రియ మొదలై ఏడు దశాబ్దాలు అయింది.18 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిది మంది దిగ్గజ నేతలే ఎంపీ గా పనిచేసారు.
అయినా ఎవ్వరు కేంద్ర మంత్రులు కాలేక పోయారు. అర్వింద్ రెండో సారి గెలిస్తే మోడీ క్యాబినెట్ లో బెర్ట్ దక్కుతుందని కాషాయ శ్రేణులు ఎన్నికల ప్రచారంలోనే ధీమా గా చెప్పాయి .
అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి అర్వింద్ ఎన్నికల్లో గెలుపు సొంత చేసుకున్నారు.గతంలో కన్నా ఎక్కువగానే మెజార్టీ సాధించినా బీజేపీ అధిష్టానం మొండి చెయ్యి చూపింది.