మూడో దఫా ప్రధానిగా కాసేపట్లో బాధ్యతలు చేపట్ట బోతున్న మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరికీ అవకాశం వచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ లకు మోడీ క్యాబినెట్ లో బెర్త్ దొరికింది.
కిషన్ రెడ్డి ఈపాటికే కేంద్ర మంత్రి వర్గంలో క్యాబినెట్ హోదా లో ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏకంగా ఎనిమిది స్థానాలు గెలవడంతో మంత్రి పదవుల కేటాయింపులోనూ ప్రాధాన్యత దక్కింది.