లోకసభ ఎన్నికల కోడ్ తొలిగి పోవడం తో ప్రభుత్వ శాఖల్లో భారీగా బదిలీలు భారీఎత్తున జరుగుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గత ప్రభుత్వ తాలూకు కీలక అధికారులను మార్చేసింది.
కానీ జిల్లా లో ఈ పక్రియ ఇంకా పూర్తీ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల అయ్యాక అధికార పార్టీ సర్దుకునేలోపే లోకసభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
లోకసభ ఎన్నికల పక్రియ కూడా పూర్తీ కావడంతో యంత్రాంగం లో సమూల ప్రక్షాళన ఫై దృష్టి పెట్టారు సీఎంవో స్థాయిలో ఇందుకు సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయనేది అధికార పార్టీ నేతలు చెప్తున్న మాట. జిల్లా స్థాయిలోనూ గత ప్రభుత్వ ముద్ర లు లేకుండా చర్యలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా నే జిల్లా పాలన వ్యవస్తలోనూ ప్రక్షళన జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కలెక్టర్ కమిషనర్ ,అదుపు కలెక్టర్ లతో పాటు మున్సిపల్ కమిషనర్ లందరూ గత బిఆర్ యస్ ప్రభుత్వంలో పోస్టింగ్ లు పొందినవారే.
ఒక్క పోలీస్ కమిషనర్ మాత్రమే ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో నియామకం అయ్యారు. వీరంతా జిల్లాలో పాలనా వ్యవస్థలో కీలకం అందుకే వీరిస్థానాల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకోవాలనేది అధికార పార్టీ నేతల ఆలోచనగా ఉంది.
ఇందులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ లు పాలన వ్యవహారాల్లో ఎవ్వరి మాట లెక్క చేయరు. నిజానికిగతంలో బిఆర్ యస్ అగ్ర నేతల అడ్డగోలు సిఫారస్ లను సైతం సున్నితంగానే పక్కకు పెట్టేసేది.
ముఖ్యంగా భూవివాదాల్లో ధరణి లో మార్పుల కోసం అప్పటి ఎమ్మెల్యే అదే పనిగా ఒత్తిడి చేసేవారు కానీ కలెక్టర్ రాజీవ్ గాంధీ మాత్రం నిబంధనల మేరకు పని చేసే వారు .బిఆర్ యస్ మరోసారి అదికారంలోకి వస్తే ముందుగా కలెక్టర్ బదిలీ చేయిస్తానని అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి సన్నిహితులకు చెప్పారు కూడా.
ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో బాధ్యతలు చేపట్టిన కల్మేశ్వర్ సహజంగానే బిఆర్ యస్ ప్రజాప్రతినిధులను పెద్దగా పట్టించుకొలేక పోయారు. కేవలం ఎన్నికల నిర్వహణ పనులకోసమే వచ్చినట్లుగా ఆయన భావించేవారు.
అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ నేతల నగదు కూడా పట్టుకోవాలని కిందిస్థాయి అధికారులను గట్టిగా పురమాయించారు. అదీగాక ఎన్నికల్లో ఆయన నిక్కచ్చిగా పనిచేయడం కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చినట్లుఅయింది.
అందుకే అసెంబ్లీ ఎన్నికల తరవాత ఉన్నఫలంగా కమిషనర్ ను మార్చేయాలనే డిమాండ్ కాంగ్రెస్ నేతల్లో రాలేదు. దీనితో కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ ఆయన్ని యధావిధిగా కొనసాగించింది. కానీ లోకసభ ఎన్నికల కోసం జరిగిన ఎస్సై సీఐ బదిలీల్లో ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ కీలక నేతల సిఫారస్ లను అసలే పట్టించుకోలేదు.
అదే కొంత మంది నేతలకు మింగుడు పడలేదు. ఈ మేరకు వారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముందు గోడు వెళ్లబోసుకున్నారు.లోకసభ ఎన్నికల కోడ్ ఎత్తివేసాక ఎలాగో పెద్దఎత్తున బదిలీలు వుంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
బదిలీల్లో నే కాదు శాంతి భద్రతల నిర్వహణలో నూ కమిషనర్ ఎవ్వరూ చెప్పినా లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఆయన కమిషనర్ గా కొనసాగించడానికి అధికార పార్టీలో ఓ కీలక నేత ఆసక్తి గా లేరని ప్రచారం జరుగుతుంది .
వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ సైతం బదిలీ అవుతారని సమాచారం
