రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు ఈ ఘటన వేల్పూర్ మండంల్లో చోటు చేసుకుంది.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.
మోర్తాడ్ గ్రామానికి చెందిన అశ్రాఫ్ అలీ ద్విచక్ర వాహనంపై మోర్తాడ్ వైపు వెళ్తుండగా వెల్ వెల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మారో బైక్ ఎదురుగా వస్తున్న సమయంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో అశ్రాఫ్ అలీకి తీవ్ర గాయాలు అయ్యాయి.
దీంతో క్షతగాత్రడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
