మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ మెస్ బిల్లులు మంజూరు చేయాలి.మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెండింగ్ మెస్ బిల్లులు, పెంచిన వేతనాలు సత్వరం చెల్లించాలనీ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నా భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో వంట కార్మికులకు రూ.10వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఈ క్రింది సమస్యలను పరిష్కరించవల్సిందిగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్య డిమాండ్స్:
వంట కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను, పెంచిన వేతనాలను సత్వరం చెల్లించాలని.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా వంట కార్మికులకు రూ.10వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. వంటపాత్రలను ఇవ్వాలి.
వంట సరకులను గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. లేదా స్లాబ్ రేటు రూ. 25 లు చెల్లించాలి.
వయస్సు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు ఇవ్వాలి.ఎం.అర్.ఓ ద్వారా వంట కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి.వంట కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫాంను ఇవ్వాలి.రాగిజావా అల్పాహారం అందించినందుకు గాను అదనపు వేతనం చెల్లించాలి.
వంట కార్మికులను అక్రమంగా తొలగించరాదు. ప్రమాద బీమా పథకం అమలు చేయాలి.మధ్యాహ్న భోజనం పథకాన్ని (ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదు.
మధ్యాహ్న భోజన వంట కార్మికులను నాల్గవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వై. ఓమయ్య తదితరులు పాల్గొన్నారు.