నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ లో ఓ మహిళా ఆత్మ హత్య కు యత్నించిన ఘటన మంగళవారం జరిగింది. మాక్లూర్ మండలం దాస్ నగర్ కు చెందిన నర్సమ్మ తన స్థలంనుం కొందరు కాంగ్రెస్ నేతల అండ తో కబ్జా కు పాల్పడుతున్నారని మున్సిపల్ అధికారులకు పలు మార్లు పిర్యాదు చేసింది.
ఆ స్థలం లో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులను ఆపేయించారు. కానీ కాంగ్రెస్ నేతల అండతో పనులు యధావిధిగా సాగిస్తున్నాడు దీనితో మాక్లూర్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసారు. దీనితో మాక్లూర్ ఎస్సై నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించి వెళ్లారు.
అయినప్పటికి పనులు అలాగే జరుగుతుందండంతో ఆమె మంగళవారం నేరుగా నిజామాబాద్ వచ్చి కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి పురుగుల మంది తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీనితో అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు