HomeCRIMEచోరి కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష....

చోరి కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష….

చోరీ కేసులో ఓ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బోధన్ అడిషనల్ జడ్జి సాయి శివ గురువారం తీర్పు చెప్పారు. రుద్రూర్ ఎస్సై అయిన తెలిపిన వివరాల ప్రకారం..

2017 నవంబర్ 19న లో రుద్రూర్ గ్రామానికి చెందిన శశికళ ఇంట్లో 3 తులాల బంగారం,10 తులాల వెండి ఆభరణాలు,వెయ్యి రూపాయల నగదు అపహరించారు.

శశికళ రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణలో బోధన్ కు చెందిన ఎరికల్వరి అశోక్ వ్యక్తినీ అరెస్టు చేసి విచారించగా నిజం ఒప్పుకున్నాడు.అతని నుంచి సొమ్ము స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఈ కేసులో నిందితుడినీ గురువారం బోధన్ కోర్టు లో హాజరు పరచగా అడిషనల్ జడ్జి సాయి శివ నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష మరియు వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు బాధితుల తరుపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్ రాణి వాదనలు వినిపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments