నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కుకొత్వాల్ నియామకంలో కసరత్తులు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ నియామకం విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎందుకు చొరవ చూపడం లేదనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.
అధికార పార్టీలో కీలక నేతలు సిఫారస్ ల నేపథ్యంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలనే విషయంలో ఎడతెగని కసరత్తులు జరుగుతున్నాయి.సుమారు 50 రోజులుగా కామారెడ్డి ఎస్పీ ఇంచార్జ్ గా కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆమె కూడా ఎదో మొక్కుబడిగా ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.ఏసీపీ అంతా తామై పనిచేస్తున్నారు. గతంలో కమిషనర్ గా ఉన్న కల్మేశ్వర్ కఠినంగా పనిచేయడంతో ఏసీపీ స్థాయి అధికారులు సైతం ఉక్కిరి బిక్కిరి అయి పనిచేయాల్సి వచ్చేది.
ఒకరిద్దరు మినహా అధికార పార్టీ దిగ్గజ నేతలు సైతం పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుంటే జడుసుకునే వారు.ఆయన మీద నేరుగా సీఎం రేవంత్ కు పిర్యాదు చేసినా ఆయన లైట్ తీసుకునేది. కానీ ఆయన అనూహ్యంగా కేంద్ర సర్వీస్ లోకి బదిలీ అయ్యారు.
అక్టోబర్ 19 న ఆయన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు దీనితో కామారెడ్డి ఎస్పీ ఇంచార్జి గా నియామకం అయ్యారు. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త సీపీ నియామకం అవుతారనే సంకేతాలు ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి.
గతంలో కామారెడ్డి గా ఎస్పీ గా పనిచేసిన మహిళా ఐపిఎస్ నే కమిషనర్ గా పోస్టింగ్ కాబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ఈ మేరకు సీఎం రేవంత్ సన్నహితుడైన మాజీ మంత్రి సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చర్చ జరిగింది కానీ మరో కీలక నేత తనకు సన్నహితుడి పేరు ను కమిషనర్ పోస్టు కోసం సీఎం కు సిఫార్స్ చేయడంతో కొత్వాల్ పోస్టింగ్ లో ప్రతిష్టంభన ఏర్పడింది.
సదురు మాజీ మంత్రి క్యాబినెట్ లో చేరాకే కమిషనర్ పోస్టింగ్ లో చిక్కుముడి వీడుతుందనే టాక్ అధికార పార్టీ వర్గాల్లో బలంగా ఉంది.ప్రభుత్వ ఏడాది ప్రజా పాలనా ఉత్సవాలు సైతం కమిషనర్ లేకుండానే నిర్వహించారు ఈ నెలాఖరు లో భారీఎత్తున ఐపిఎస్ ల బదిలీలు జరుగుతాయని చెప్తున్నారు ఆ క్రమంలోనే కమిషనర్ పోస్టింగ్ వుంటుందనే వాదన పోలీస్ వర్గాల్లో ఉంది
