విద్యార్థి మృతికి కారణమైన కాకతీయ విద్యా సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ,మృతి పై సమగ్ర విచారణ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్ లు డిమాండ్ చేశారు.
వారు ఆదివారం నిజామాబాద్ నగరంలో పత్రిక విలేకరుల సమావేశంఏర్పాటు చేశారు కాకతీయ విద్యాసంస్థల్లో గత రెండు రోజుల క్రితం జశ్వంత్ రెడ్డి అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందటం పట్ల పిడిఎస్ యూ తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు.
అలాగే విద్యార్థి మృతికి కారణమైన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి అనారోగ్యంతో ఉన్నాడని చనిపోక ముందు మూడు రోజులుగా సంబంధిత వార్డెన్ కు, బాధ్యులకు సమాచారం ఉన్న హెల్త్ ఎమర్జెన్సీ లా చర్యలు తీసుకోక పోగా వార్డెన్ నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు PDSU పరిశీలనలో తేలింది అని అన్నారు.
విద్యార్థి పట్ల దురుసుగా వ్యవహరించి, అనారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణినే విద్యార్థి మృతి కి కారణమయ్యారని మండిపడ్డారు.హాస్టల్లో సరైన సౌకర్యాలు భోజన వసతులు కల్పించకుండా కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో డే స్కాలర్స్ విద్యార్థులు చిన్నపాటి అనారోగ్యం కు గురయితే ఫోన్ చేసే విద్యాసంస్థలు ఉన్నాయని అలాంటిది సరైన సమయంలో విద్యార్థి తల్లి, తండ్రులకు సమాచారం ఇవ్వక పోవడం నిర్లక్ష్యం కనపడుతుంది అన్నారు.
తప్పు చేయకపోతే ఎందుకు విద్యార్థిని భౌతిక కాయం దొంగ చాటున తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నామన్నారు .వెంటనే విద్యాశాఖ అధికారులు కలెక్టర్ గారు స్పందించి న్యాయబద్ధంగా విచారం చేయాలని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ తారుమారు కాకుండా, నిష్పక్షపాతంగా విద్యా శాఖ అధికారులు విచారణ చేయాలని కోరారు.
అలాగే మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టి కమిటీలు వేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, నాయకులు రవీందర్,అక్షయ్,రాకేష్ ,వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
