HomeLaw and Orderనిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలుముమ్మరంగా వాహన తనిఖీలు.

నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలుముమ్మరంగా వాహన తనిఖీలు.

పోలీసులు, ఆర్టిఏ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్..ట్రాఫిక్ ఏసిపి నారాయణ…. నిజామాబాద్ సీపీ కామలేశ్వర్ ఆదేశాల మేరకు. మంగళవారం నగర శివారులోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, ఆర్టిఏ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసిపి నారాయణ తెలిపారు.

మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రిబుల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ఓవర్‌లోడ్‌తో కూడిన వాహనాలు, నాసిరకం రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌లతో వాహనాలు నడిపే వారిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఈ తనిఖీలో ఆర్టీఏ అధికారి ఎంవీఐ కిరణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ చంద్ర శేఖర్ , మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుదీర్ రావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలు పాటించండి… ఏసిపి…వాహ నాల నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ కన్పించకుండా చేయడం, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా తాత్కాలిక నంబర్ తోనే వాహనాలపై తిరు గుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిఏసిపి నారాయణ హెచ్చరించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments