అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుత ను తప్పించబోయిన వాహనం బోల్తా పడిన ఘటనలో యువతి మృతి చెందారు.మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండల్ వాయి కి చెందిన లలిత(30).యాచారం కు చెందిన ప్రభాకర్ కు 11సంవత్సరాల క్రితం వివాహమైంది.
వీరికి ఇద్దరు కుమారులు.మంగళవారం రాత్రి నిజామాబాద్ నుంచీ యాచారం వెళ్ళే మార్గ మధ్యంలో మంచిప్పా అటవీ ప్రాంతంలో రోడ్డు దాటే యత్నంలో ఉన్న ఓ చిరుతను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు అక్కడున్న బండ రాయి కి ఢీ కొనడంతో ఆమె కార్ లోనే ఇరుక్కుంది.
ప్రమాదం విషయం గమనించి స్థానికులు సంఘటన స్థలానికి వచ్చి కారులో ఇరుక్క పోయిన లలిత బయటికి తీశారు కానీ అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.లలిత కుటుంబ సభ్యుల సమాచారం గతం లో ప్రభాకర్ కి లలితకి మధ్య గొడవ జరుగుతుండేదనీ పేర్కొన్నారు.దీనిపై లలిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.