గ్రామ పంచాయతీలో పని చేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామ పంచాయితీ సిబ్బందికి గత పది నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీలోని ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల జీతాలు ఉన్న జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏడు నెలలుగా విడుదల చేయాల్సిన గ్రాంట్లు గ్రామ పంచాయితీలకు చేరకపోవడంతో నేడు పంచాయితీలు పంచాయతీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదనీ పేర్కొన్నారు.
అదే విధంగా గ్రామ పంచాయతి సిబ్బందికి 3-8 నెలల బకాయి వేతనాలు చెల్లించాలనీ అలాగే జివో. నెం. 51 వేంటనే సవరణ చాయాలనీ పేర్కొన్నారు.
అదే విధంగా మల్టీపర్సస్ వర్కర్స్ విదానం రద్దు చేయాలనీ, గ్రామ పంచాయతి కార్మికులందరికి పర్మినెంట్ చాయాలనీ డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతి కారోబార్, బిల్ కలెక్టర్లకు, సహాయ కార్యదర్శులుగా అర్హత కలిగియున్న కార్మికులందరికి రికార్డు అస్సిసెంట్గా నియమించాలనీ కోరారు.జి.వో నెం. 60 ప్రకారం గ్రామ పంచాయతి కార్మికులు వేతనాలు స్వీఫర్కు 16,500 కారోబార్స్, వాటర్మేన్, ఎలట్రిషియన్కు 19,500, ట్రాక్టర్ డ్రైవర్స్ 22,500 వేతనాలు చెల్లించాలనీ తెలిపారు.
గ్రామ పంచాయతి సిబ్బంది అందరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల రూపాయలు అమలు చేయాలి. పి.ఎఫ్ ఈఎస్ఐ.ఐ. పోస్టాఫీస్ భీమా పథకం, గ్రాట్యూటి సౌకర్యాలు, కల్పించాలనీ అన్నారు.
అలాగే గ్రామ పంచాయతి కార్మికుడు మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలనీ ఆదేశించారు.
అదాయమున్న పంచాయతీలలో వేతనాలు పెంచుకునందుకు అనుమతి ఇవ్వాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.