క్షణికావేశంలో వివాహిత ఆత్మ హత్య యత్నం…క్షణికావేశంలో వివాహిత ఆత్మ హత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలోనీ నాలుగవ టౌన్ పరిధిలో బుదవారం చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.నగరం లోని వినాయక నగర్ కు చెందిన శిరీష(24).కు శ్రీకాంత్ కు గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిరీష వాళ్ళ చిన్నమ్మ విరితోనే ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలో శ్రీకాంత్ వృత్తి రీత్యా ఆర్మూర్ లో ఓ హోటల్ లో పని నిమిత్తం వెళ్ళాడు.బుదవారం శిరీష కు ఆమె చిన్నమ్మ కు మధ్య చిన్న గొడవ జరిగింది.దానికి శిరీష క్షణికావేశంలో ఇంట్లొకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.
అది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.
