ప్రమాదవశాత్తు రైలు లోనుంచి జారీ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ నగరంలోని దుబ్బ కు చెందిన బుక్క స్వామి(22).గుర్తు తెలియని రైలు లోనుంచి ప్రమాదవశాత్తు కాలు జారీ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.