.కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు కాలు జారీ వ్యక్తి కి తీవ్ర గాయాలు అయిన ఘటన డిచ్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.సంబులే విష్ణు(60).
వృతి రీత్యా రైల్వేల్లో ముర్మురాలు అమ్ముకుంటారు.బుదవారం నాందేడ్ నుంచి కాచిగూడ వెళ్తున్నా ప్యాసింజర్ రైలు డిచ్ పల్లి స్టేషన్ లో ఆగి తిరిగి కదులుతున్న సమయంలో ఒక కోచ్ నుంచి మరో కోచ్ లోకి వెళ్లేందుకు రైలు దిగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారీ పట్టాల మద్యన ఇరుక్కుపోయారు.
అప్పటికే కదిలిన రైలు అతని కాలు పై నుంచి వెళ్ళగా కాలు తెగిపోయింది.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పట్టాల మధ్యలోనుంచి తీసి హుటాహుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ సాయి రెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.
