ఓ గుర్తు తెలియని కుళ్ళిపోయిన మృతదేహం మీట్టాపూర్ గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన లభ్యమయ్యింది.
నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మీట్టాపూర్ రైల్వే ట్రాక్ పక్కన పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు.
సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారని పేర్కొన్నారు.మృతదేహన్ని గమనించిన స్థానిక ట్రాక్ మెన్స్ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుపు రంగు ఫుల్ సేటు ధోతి ధరించినాడు మృతుని వివరాలు తెలిసినచో నెంబర్ 87126 58591 వివరాలు తెలుపగలరనీ నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.