నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతుంది. సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో ధర్మపురి హిల్స్ లోనీ రంజని బాబా దర్గా ప్రాంతానికి చెందిన హాసన్ (50) గా పోలీసులు గుర్తించారు.
హసన్ దర్గా బాగోగులు తీసుకోవడంతో పాటు, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే తాయెత్తులు కట్టేవాడని స్థానికులు చెబుతున్నారు.
కత్తులతో పొడిచి, గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థానాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
హత్యాకు గల కారణాలు తెలియాల్సి వుంది.