HomeTelanganaNizamabadకలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు.

ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలతో సామరస్యంగా వ్యవహరిస్తూ, సంతృప్తికరంగా సేవలు అందించాలని హితవు పలికారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఆయా శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments