తెలంగాణ రాష్త్రం ఏర్పాటు అయ్యాక భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రాష్ట్రలకు సరిహద్దులో ఉండే ములుగు జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది.ములుగు జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు. మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో కీలక నేతలున్నారు .ఇల్లందు – నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కుర్సం మంగు అలియాస్ భద్రు(35) అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమాండర్ ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు(43)తో పాటు దళ నాయకులు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్(22), దళ సభ్యురాలు ముస్సాకి జమున(23), జైసింగ్(24), కిషోర్(22), కామేష్(23) ఉన్నారు.
ఆదివారం తెల్లవారుజామున పోలీస్ కూంబింగ్ దళాలకు చెల్పాక వద్ద ఎదురుపడటంతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. రెండు AK-47 రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దళ కమాండర్ బద్రుతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. బద్రుపై రూ.20 లక్షల రివార్డు ఉంది. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన బద్రు స్వస్థలం ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చెరమంగి..
పక్కాగా సమాచారం …….రంగంలోకి గ్రేహౌండ్స్
ఛత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లు తో నిర్బంధం పెరగడంతో మావోయిస్టులు సరిహద్దు లో ఉండే తెలంగాణలోషెల్టర్ కోసం వస్తున్నారని ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, నూగూరు వెంకటాపురం అడవుల్లో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతో . గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపట్టాయి.
వీరాపూర్ అటవీ ప్రాంతంలో దళాలు సేదతీరుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తుండగా సెంట్రీ టీం అప్రమత్తమైంది. మావోయిస్టులు డెన్‌ను ఖాళీ చేసే క్రమంలో నిత్యావసరాలు, సామగ్రిని వదిలేసి వెళ్లారు.
అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతి సమీపంలోకి రావడంతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా ఫైరింగ్‌కు దిగారు. సుమారు 15 నిమిషాలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
