HomeEditorial Specialగ్యాస్ నిల్వల మీద అప్రమత్తం అయిన ఏజెన్సీ లు ....ఎడపెడా బుకింగ్ లకు చెక్...

గ్యాస్ నిల్వల మీద అప్రమత్తం అయిన ఏజెన్సీ లు ….ఎడపెడా బుకింగ్ లకు చెక్ ..

ఎడారి దేశాల్లో యుద్ధం ఉవ్వెత్తున సాగుతుండడంతో రాబోయే రోజుల్లో గ్యాస్ కొరత రాబోతుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనితో సామాన్య ప్రజానీకం ముందుగా గ్యాస్ నిల్వ ల మీద ఉరుకులు పెడుతున్నారు.

గ్యాస్ కొరత నేపథ్యంలోనే కేంద్రం గ్యాస్ ధరను అమాంతంగా పెంచేసింది ఒక్కో సిలిండర్ పైన దాదాపు 60 రూపాయలు పెంచేసింది. అసలు గ్యాస్ ధరలను అమాంతంగా పెండడం ఫై ప్రతిపక్షాలు గొంత్తెతక ముందే గ్యాస్ కొరత ఫై సామాన్య ప్రజానీకం లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

అందుకే ఆయా గ్యాస్ ఏజెన్సీ లకు బారులు తీరుతున్నారు యుద్ధం మరింత ముదిరి గ్యాస్ కొరత రావచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది అందుకే ఆన్ లైన్ లో ఎడాపెడా సిలెండర్ లను బుక్ చేస్తున్నారు ముఖ్యంగా డబుల్ సిలెండర్ ఉన్న వినియోగ దారులు కనీసం 40 రోజులు దాటాకే బుకింగ్ చేసుకునే వారు ఒక్క నెలలో రెండు సిలెండర్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది సింగిల్ సిలెండర్ ఉన్న వారికి ఎలాంటి సీలింగ్ వుండదు.

కానీ గత వారం రోజలుగా గ్యాస్ సిలెండర్ లకోసం ఆన్ లైన్ బుకింగ్ ఎడాపెడా సాగుతున్నాయి. దీనితో అప్రమత్తం అయిన ఆయా కంపెనీలు అన్ లైన్ లో సిలెండర్లు బుకింగ్ లకు సంబంధించి అనేక ఆంక్షలు అమల్లోకి తెచ్చింది డబుల్ సిలెండర్ ఉన్న వారు నెలరోజులు దాటని తర్వాతే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని నిర్దేశించింది.

ఆన్ లైన్ లో నమోదు చేసుకొని వారికి నేరుగా వస్తే సిలెండర్ లు ఇవ్వకుండా ఏజెన్సీ లను కట్టడి చేస్తుంది మరో వైపు ఆయా ఏజెన్సీ లు సైతం గ్యాస్ నిల్వలు పెంచుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.

హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పలు హోటల్స్ ల్లో గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి అసలే పవిత్ర రంజాన్ మాసం కావడంతో రాత్రంతా లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది కానీ ఇప్పటికే కొన్ని పెద్ద హోటల్స్ కు అడిగినంత సిలెండర్లు సప్లై చెయ్యలేని పరిస్థితి రేపు, ఎల్లుండి పరిస్తితిని బట్టి హోటల్స్ మూసివేత ఫై నిర్ణయం తీసుకుంటామని హోటల్స్ అసోసియేషన్ చెప్తుంది రోజు వారిగా 15 నుంచి 20 గ్యాస్ సిలాండర్స్ అవసరం ఉంటుందని కానీ ఏజెన్సీ లు ఇప్పుడు సిలెండర్లు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు

ఇప్పుడు అవి కూడా రాకపోతే తమ సిబ్బందికి తిండి కూడా పెట్టలేని స్థితి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి గ్యాస్ నిల్వ కొరత లేకుండా చూడాలని యాజమాన్యాలుకోరుతున్నాయి ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 6వేల హోటల్స్ ఉన్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments