మాయదారి మహమ్మారి కరోనా మరోసారి ప్రమాద ఘంటికలు మోగించింది.నగరంలో ఓ యువకుడికి కరోనా నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ప్రత్యేక వార్డు ను ఆదివారం నుంచి పూర్తీ స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
నగరానికి చెందిన ఓ యువకుడి జ్వరం జలుబు లక్షణాలతో ఆసుపత్రి రాగ వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. దీనితో ఆయనకు కరోనా నిర్ధారణ జరిగింది. అక్కడే స్పెషల్ వార్డు లో చేర్చి చికిత్స చేసారు.
మరో ఇద్దరు యువకులు ఇలాంటి లక్షణాలతోనే ఆసుపత్రికి వచ్చి నిర్దారణ పరీక్షలు చేసుకోకుండా తదుపరి చికిత్స ను నిరాకరించి వెళ్లిపోయారు.
దేశ వ్యాప్తంగా కరోనా శర వేగంగా విస్తరిస్తుంది రోజు వేలాది కేసు నమోదు అవుతున్నాయి. ఈపాటికే కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తం చేసింది.
