ఇందూర్ నగరం : రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి & షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కింద లక్షనూటపాదహారు రూపాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కల్యాణలక్ష్మితో మరియు షాదీ ముబారక్ చెక్కుల అమౌంట్ మొత్తాన్ని పెంచడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా ఇవ్వాలని సంవత్సరం కాలం గడుస్తున్నా తులం బంగారానికి మోక్షం కలుగలేదని ఏద్దేవా చేసారు.
చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదు అని అప్లై చేసుకున్న రెండు నెలల కాలవ్యవధిలో చెక్కులు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తన్నారు.
అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 565 మంది లబ్దిదారులకు 5,65,65,540/- (అక్షరాలా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల నలపై రూపాయలు) విలువ గల చెక్కులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు, తాజా మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
