డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన అంబులెన్స్ డ్రైవర్ కి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 2వ తారీఖున ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ మరియు సిబ్బంది నిఖిల్ సాయి చౌరస్తా యందు వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇసాక్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.
వెంటనే బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే అదుపులోనికి తీసుకొని, అంబులెన్స్ నీ సీజ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
డ్రైవర్ ను బుదవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్ అహ్మద్ మోయిద్దీన్ అంబులెన్స్ డ్రైవర్ కి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అలాగే మరో 14 మంది వ్యక్తులకు రూ 38,000 రూపాయల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
