ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ సార్ గారి చేతులమీదుగా యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ భారతదేశంలో పాలకవర్గాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి క్రమక్రమంగా ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలను ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీల వరకు కార్పొరేట్ తబేదారుల చేతుల్లో పెడుతున్నారు అని అన్నారు.
అదే విధంగా కేంద్ర,రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యను క్రమక్రమంగా కేంద్రం చేతిలోకి తీసుకొని అఖిలభారత స్థాయిలో కామన్ ఎంట్రెన్స్ టెస్టులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల కష్ట పడి ,చెమటోడ్చి సంపాదించిన డబ్బును లక్షలాది రూపాయలు చెల్లించి కోచింగ్ సెంటర్లకు పంపించడం, అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక బావి భారతపౌరులుగా ఎదగవలసిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నామని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు కొమ్ము వాస్తు,ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందించడంలో పూర్తిగా విఫలం అయ్యావని అన్నారు.
అలాగే భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ 1984 ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడింది సమస్యలపై ఇతర రాజకీయ సామాజిక అంశాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్నారు అలాగే భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు ఈ నెల (డిసెంబర్) 14,15తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలో విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపకల్పన చేయబోతున్నాము అన్నారు.
ఈ మహాసభలను విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తూనే, ఉజ్వల భవిష్యత్తుకై కష్టపడి చదువుకోవాలని సూచించడం జరిగిందని అన్నారు..
ఈ కార్యక్రమంలో USFI ఉపాధ్యక్షులు వేణు,బాపురావు మరియు నగర నాయకులు పవన్,నిఖిల్,వరదరాజ్ తదితరులు పాల్గొన్నారు.
