అప్పుల బాధ తాళలేక జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన బోండ్ల భరత్ అనే ఆర్మీ మాజీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు సంవత్సరాల క్రితం సైనిక దళంలో పనిచేసిన జవాన్ భరత్ గత మూడు సంవత్సరాలుగా పడకల్ లో నివాసం ఉంటున్నాడు.
మృతుని భార్యతో గత కొంతకాలంగా కుటుంబ విభేదాలు తలెత్తినట్టు సమాచారం. దీంతో ఇటీవల కాలంలో మద్యానికి కూడా బానిసైనట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అప్పుల బాధ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం.జక్రాన్ పల్లి పోలీసులు మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు .
