ఈ మేరకు విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది. కోర్టు అనుమతి ఇస్తే తీహార్ జైలు లోనే విచారించాలని సీబీఐ బావిస్తోంది. లిక్కర్ స్కామ్ లో సీబీఐ మొదట కేసు నమోదు చేసింది గత ఏడాది ఆరుగురు అధికారులు బృందం హైదరాబాద్ కు వచ్చి కవిత ఇంట్లోనే విచారించి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఈడీ సీబీఐ ల విచారణలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది.
కవిత ను లిక్కర్ స్కామ్ లో ఈడీ ఈపాటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు., ఆమె బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృథానే అవుతున్నాయి. గురువారం మధ్యంతర బెయిల్ పిటిషన్ ఫై విచారణ జరిగింది. కవిత కు మధ్యంత బెయిల్ ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది.దీనిపై కోర్టు తీర్పు ను రిజర్వ్ చేసింది.