కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను అమలు చేయాలనీ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేసారు ఆయన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ‘రైతు సత్యాగ్రహ దీక్ష’లో..పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా నిలబోట్టుకోలేరని స్పష్టం చేసారు. వారిచ్చిన హామీల మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు.
రైతుల ఉసురు తగిలి రేవంత్ సర్కార్ మనుగడ సాగించలేదన్నారు. రెండు లక్షల ఋణ మాఫీ ఎందుకు చేయలేక పోతున్నారని అసలు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. రైతులకు బోనస్ ఇవ్వదన్నారు. యేటా 15 వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
తమ పార్టీలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేశారని ఆయన పేర్కొన్నారు ప్రతి ఏటా రైతులకు 15000 రూపాయలు మా ఇస్తామని నమలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సాయం చేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు రైతులకు రైతులను మోసం చేస్తే అధికారం అధికారం కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో తాను మరోసారి గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కచ్చితంగా తెరిపిస్తన్నారు.
ఆయన హామీ ఇచ్చారుగతంలో షుగర్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్లను కవిత 100 కోట్లు డిమాండ్ చేశారని అందువల్లే గుత్తేదారు వాపసు వెళ్లాడన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వుండగా ఫ్యాక్టరీ కాదు కదాగేటు కూడా తెరవలేరన్నారు.కమిటీ లతో కాలయాపన చేస్తుందన్నారు గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట మేరకు తాను పసుపు బోర్డు సాదించానన్నారు.