Saturday, April 26, 2025
HomeEditorial Specialమండుతున్న ఎండలుఎండుతున్న భూగర్భ జలాలు

మండుతున్న ఎండలుఎండుతున్న భూగర్భ జలాలు

  • జిల్లాలో దారుణంగా పడిపోతున్న భూగర్భ జలాలు
  • గరిష్టంగా 50 అడుగుల లోతుకు చేరుకున్న భూగర్భ జలాలు
  • పంటలు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు
  • నీటి ఎద్దడిపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్
  • రైతులతో సమన్వయ బాధ్యత కోసం ప్రత్యేక అధికారులు

జాన రమేష్: ఇది సంగతి:
నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు రైతుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి . గడిచిన 20 రోజులు భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడం అధికారులను టెన్షన్ పెడుతుంది. గరిష్టంగా 50 అడుగుల లోతుకు నీరు వెళ్లిపోవడంతో వేసంగి పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 15 మండలాల మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్ ను ప్రభుత్వం నియమించింది.

గత వారం రోజులు ఎండల తీవ్రత 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత తో రోజురోజుకు పెరగడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయే దశకు చేరుకున్నాయి. దాదాపు 50 అడుగుల మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో గడిచిన 20 రోజుల్లో 20 నుండి 50 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీనిని దృష్టి ఉంచుకొని రేవంత్ సర్కార్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శరత్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. చీమన్ పల్లి గడ్కోల్, చిన్న వాల్గొట్, ముప్కాల్, మెండోరా, రెంజల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నార్త్ లలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నట్టు అధికారులు గుర్తించారు.

దీంతో నిజామాబాద్ కు చేరుకున్న ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలు , ఆయా మున్సిపాలిటీ ల లతోపాటు సాగునీటి శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాగునీటి ఇద్దరిని పరిష్కరించి దిశగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో సిరికొండ మండలంలోని పాకాల లో గత డిసెంబర్లో 9 మీటర్ల అడుగులో లోతుండగా జనవరిలో దాదాపు 19 మీటర్ల లోతుకు అడుగంటాయి. మార్చు చివరి వరకు దాదాపు 50 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటున్నట్టు వెల్లడించారు. అలాగే భీంగల్ మండలం గోనుగుప్పుల , చీమనుపల్లి, రామన్నపేటలో, భూగర్భ జలాల అడుగంటి పోయాయి.

నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ డివిజన్లో భూగర్భ జిల్లాల నీటి సమర్ధం గణనీయంగా తగ్గింది. దీంతో ప్రతి మండలానికి జిల్లా ఉన్నతస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో తాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఫోకస్ చేయనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయనున్నారు .

ఇంక ముందు ఉన్న వేసవిలో మరింత నీటి తీవ్రస్థాయిలో ఎదుర్కొనే పరిస్థితి అధికారుల అంచనా వేస్తున్నారు. ఐదు లక్షల ఇరవై వేల హెక్టార్లలో ఈ యాసంగిలో రైతులు పంటలు వేశారు. 60 శాతం పంట కోత దశకురాగా 40 శాతం ఇంకా కోతకు రావాల్సి ఉంది. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత 15 రోజుల క్రితం ధర్పల్లి మండలంలోని కొంతమంది రైతులు పంట సాగును కొనసాగించలేక కోసివేసి పశువులకు ఆహారంగా మార్చారు. మూడు లక్షల 70 వేల ఎకరాల్లో వరి పంట వేశారు.

సింగూరు ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి పై ఆధారపడి రైతులు పంటలు పండిస్తున్నారు. సాగు తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్న నిజాంసాగర్ చివరి ఆయకట్టు కెనాల్ కట్ట గండిపడి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తెగిపోవడంతో నీరు వృధా అయ్యింది. ఈ పరిస్థితుల్లో తాగునీటి, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!