Saturday, June 14, 2025
HomeCRIMEతెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ …….ముగ్గురు మావోలు మృతి ..

తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ …….ముగ్గురు మావోలు మృతి ..

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కాల్పుల మోత తో మారుమోగింది. శనివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు నక్సలైట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది . ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు గా పోలీసులు అనుమానిస్తున్నారు .

ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఒక ఏకే-47 తో పాటు మరో .మూడు తుపాకులు, ఇతర పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్న మని పోలీసులు తెలిపారు .ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు- చత్తీస్ గఢ్ లోని పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.జరిగింది ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు చెప్తున్న మృతుల్లో ఎవరెవరున్నారనేది ఇంకా నిర్ధారించుకోలేక పోతున్నారు కానీ , ఘటనా స్థలంలో ఏకే-47 లభ్యం కావడంతో మృతుల్లో కీలక నేతే ఉండొచ్చని భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!